Kotha Remalle
KOTHA REMALLE కొత్తరేమల్లె | |
---|---|
village | |
KOTHA REMALLE Location in Andhra Pradesh, India | |
Coordinates: 16°23′24″N 80°23′24″E / 16.390000°N 80.390000°ECoordinates: 16°23′24″N 80°23′24″E / 16.390000°N 80.390000°E | |
Country | India |
State | Andhra Pradesh |
District | Krishna |
Population | |
• Total | 500 |
Languages | |
• Official | Telugu |
Time zone | IST (UTC+5:30) |
PIN | 521110 |
Vehicle registration | AP-16...... |
భారతదేశానికి స్వాతంత్ర్యం రాకపూర్వమే ఏర్పడిన అతి చిన్న గ్రామ కొత్త రేమల్లె (In English: KOTHA REMALLE VILLAGE) హనుమాన్ జంక్షన్ పట్టాణానికి 7 కిలోమీటర్లదూరంలోనూ నూజివీడు పట్టణానికి 20 కిలోమీటర్ల దూరంలోనూ ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణ జిల్లాలో బాపులపాడు మండలం తాలూకా గన్నవరం నియోజకవర్గం (ఎమ్మెల్యే: వల్లభనేని వంశీ మోహన్ (తెలుగుదేశం పార్టీ)) రేమల్లె గ్రామ పంచాయితీ (ప్రసిడెంట్: శేఖర్ బాబు (తెలుగుదేశం పార్టీ)) పరిధిలో ఉన్నది. ఊరికి తూర్పు వైపున జిల్లా పరిషత్ ఉన్నత పాటశాల సుమారు 400 మంది విధ్యార్డులతోనూ & 33/11 కేవి విద్యుత్ ఉపకేంద్రం మరియు పడమర వైపున ప్రాధమిక పాటశాల సుమారు 70 మంది విధ్యార్డులతోనూ, ఆనుకునే పెద్ద చెరువు సరిహద్దులుగా చెరువును ఆధారం చేసుకుని 25 ఎకరాల వరకు పొలాలు సాగుబడిలో ఉన్నాయి.
సుమారు 100 ఇళ్ళు మాత్రమే ఉన్న కొత్త రేమల్లె గ్రామంలో సకల సౌకర్యాలకు, సదుపాయాలకు లోటే ఉండదు. ఊరు చుట్టూరా పొలాల్లో నిత్యావసర సరుకులు (టమోటా, మిర్చి, మినుములు, దోసకాయలు, బీరకాయలు) లతో పాటు వాణిజ్య పంటలు (చెరుకు, పత్తి, పామోలిన్, వేరు శెనగ, జామ కాయలు) లతో పాటుగా దేశ ప్రాచుర్యం పొందిన నూజివీడు మామిడి కూడా పండును. గ్రామంలోకి ప్రవేశించిన రెండో వీధి ప్రారంభంలో శ్రీ అభయాంజనేయ స్వామీ వారి ఆలయం (నిర్మాణం: 15-04-1999) ఉన్నది. ఒకప్పుడు నిత్యం ఆంజనేయ దండకం, ఆంజనేయ జయఘోష, హనుమాన్ చాలీసా, హనుమాన్ సూక్తమ్,శ్రీ హనుమాన్ స్తోత్రం, ఆదిత్య హృదయం మరియు భక్తీ పాటలతో విరాజిల్లుతుండేది. నేడు మత మార్పిడులు (ఎదురుగా ఒక చర్చి) చోటు చేసుకోవడంతో శోభ తగ్గి పండుగప్పుడే కళకళలాడుతుంది.
విభిన్న కులాలకు (ముఖ్యంగా: మాదిగ, కమ్మ, సాలీలు) చెందినవారు ఉన్నప్పటికీ అందరూ కలిసికట్టుగానే గృహనిర్మాణాలు చేసుకున్న మనసున్న వారు. కుల పట్టింపులు లేకుండా కలిసి జీవిస్తున్న వీరిలో మతమార్పిడులు రోజురోజుకు పెరిగి కలవరపెడుతున్నాయి. భారతదేశం భిన్నత్వానికి ఏకత్వంలా కొత్త రేమల్లె గ్రామం కూడా అందుకు మినహాయింపేం కాదు. ఎంతమంది వచ్చినా అక్కున చేర్చుకుంటుంది. అందుకు తార్కాణమే గ్రామం చివర నిర్మించిన మోహన్ స్పింటేక్స్ ప్రయివేటు లిమిటెడ్ కంపెనీ మరియు విజయ్ కుమార్ ఆగ్రో ప్రొడక్ట్స్ ప్రయివేటు లిమిటెడ్ కంపనీలు. ఈ రెండు ఫ్యాక్టరీలు వలన ఆతిధ్య గ్రామానికి కాక పక్క గ్రామం ప్రజలకు కూడా ఉపాధి లభిస్తుంది. ఫ్యాక్టరీల వ్యర్ధ పదార్ధాల వలన ఆయుకట్టు చెరువు పాడైపోవడం, మురికి గుంటలు తయారవడం మరియు పచ్చదనం నిండాల్సిన పొలాల్లో కాలుష్యం విజ్రుంభించడం బాధపడే, ఆలోచించాల్సిన అంశాలు.
ఫ్యాక్టరీలు వలన పాడైపోయిన చెరువులోకి మట్టిని చేర్చి కొందరు ఆక్రమించుకోవడం కలవరపెడుతుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తుల్లా ఎవరికీ వారు తమ తమ సరిహద్దులను నిర్ణయించుకుంటున్నారు. 60 వసంతాల నుండి గ్రామ పంచాయితీ నడుస్తున్నా సరైన అభివృద్దికి నోచుకోకపోవడం దురదృష్టకరం. అశోకుని వనంలా రోడ్డుకిరువైపులా చెట్లు చేసే సందళ్ళు ఫ్యాక్టరీలరాకతో కనుమరుగై వాటి స్థానంలోనే పెద్ద పెద్ద ఎలక్ట్రిక్ వైర్లు వచ్చి చేరాయి. ప్రమాదమేదైనా సంభవిస్తే గ్రామమంతా కాలిపోయే ప్రమాదం పొంచి ఉంది.
శుభకార్యమైనా అశుభకార్యమైనా జనమంతా కలిసికట్టుగా పని చేస్తారు. అవాంచనీయ సంఘటనలు ఏవైనా జరిగినట్లయితే వాటిని పరిష్కరించుకోవడానికి గ్రామ పెద్దలంతా కమ్యూనిటీ భవనంలో సమావేశాలు ఏర్పాటు చేస్తారు. సంక్రాంతికి కోడి పందేలతోనూ హరిదాసులతోనూ, విజయదశమికి ఆలయాల భజనలతోనూ, క్రిస్టమస్కు ప్రార్ధనల కూటములతోనూ విరాజిల్లుతూ ఉంటుంది. ఇక్కడ ప్రజలకు ఆవేశంతోపాటు సాయం చేసే గుణమూ ఎక్కువే! రైతులతో పోటీగా కౌలుదారులు కూడా కష్టపడి గ్రామానికి వన్నె తెస్తున్నారు. కొత్త తరంలో వ్యక్తులు కష్టపడి ఉన్నత స్థానాలకు చేరుకుంటున్నారు.
కొత్తగా ఏర్పడిన పంచాయితీ కాస్త చొరవ తీసుకోవడంతో మంచినీళ్ళు, వీధిదీపాలు, సిమెంట్ రోడ్డులు లాంటి పనులు ప్రజల మనస్సులను చూరగొనడం ఒకవైపైతే ప్రభుత్వ పధకాలు సరియైన రీతిలో ప్రజల్లోకి చేరకపోవడం వలన తాటాకు ఇళ్ళల్లోనే జీవించాల్సి రావడం మరోవైపు. మహిళా మండళ్ళు, సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు విరివిగా ఉన్నా ప్రయజనం శూన్యంలా కన్పిస్తోంది. నిరక్షరాస్యులు సభ్యులుగా ఉండడంతో మధ్యవర్తులు మంచిగా దండుకోవడం, దానికై గొడవలు పడడం తరచుగా కన్పిస్తుంది. బ్యాంకు (BANK) లతో గాని ఏటీఏం(ATM)లతో గాని రెవిన్యు డిపార్టుమెంటు లతో గాని పనుల కోసం 7 కిలోమీటర్ల ప్రయాణం చేసి హనుమాన్ జంక్షన్/బాపులపుడు చేరుకోవాల్సి ఉంటుంది.
ఉదయం 06:45 గంటలకు హనుమాన్ జంక్షన్ నుండి వేలేరు, రేమల్లె, సింగన్నగూడెం, మల్లవల్లి, వట్టిగుడిపాడు మీదుగా నూజివీడు చేరుకునే బస్సు సర్వీస్ ఒకటి మాత్రమే ఉన్నది. సాయంత్రం05:30 గంటలకు నూజివీడు నుండి అవే గ్రామాల మీదుగా బస్సు సర్వీస్ ఉన్నది. కళాశాలల్లో చదువుకునే విద్యార్దుల కోసం ఏపిఎస్ ఆర్టిసి (APSRTC) ప్రత్యేకంగా నడుపుతున్నది. విద్యార్దులు కూడా లేకపోయినట్లయితే ఆ మాత్రం సర్వీస్ కూడా ఉండదు. అయినా ప్రయాణాలకు ఎంత మాత్రం ఇబ్బంది లేకుండా హనుమాన్ జంక్షన్ నుండి రేమల్లె & మల్లవల్లి వరకు మరలా మల్లవల్లి నుండి నూజివీడు వరకు ఆటో ల సర్వీస్ లు ఇబ్బడి ముబ్బడిగా ఉన్నాయి.
References
|
This article is issued from Wikipedia - version of the Thursday, March 31, 2016. The text is available under the Creative Commons Attribution/Share Alike but additional terms may apply for the media files.